‘ఉప్పెన’ నుంచి జల జల.. మంటూ మరో సాంగ్‌! - uppena movie new lyrical song
close
Published : 31/01/2021 14:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఉప్పెన’ నుంచి జల జల.. మంటూ మరో సాంగ్‌!

హైదరాబాద్‌: మరో మెగా వారసుడు వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి జంటగా ‘ఉప్పెన’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రంలోని కొన్ని పాటలు విడుదలై మిలియన్ల కొద్ది వ్యూస్‌ని సాధించాయి. తాజాగా ఈ సినిమాలోని మరో సాంగ్‌ లిరికల్‌ వీడియోను నటుడు విజయ్‌ దేవరకొండ విడుదల చేశారు.  ‘జల జల జలపాతం..’అంటూ సాగుతున్న ఈ పాటను జస్ప్రీత్‌జాజ్‌ , శ్రేయాగోషల్‌ ఆలపించగా దేవిశ్రీప్రసాద్‌ సంగీతం సమకూర్చారు. ఆయన మార్కు మెలోడి టచ్‌తో సాంగ్‌ను రూపొందించారు. విలక్షణ దర్శకుడు సుకుమార్‌ పర్యవేక్షణలో ఆయన శిష్యుడు బుచ్చిబాబు ‘ఉప్పెన’కు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్‌ సేతుపతి కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఫిబ్రవరి 12న ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లలో ఆలరించనుంది. మరి అప్పటిదాకా ఈ సాంగ్‌ వీక్షించండి!

ఇవీ చదవండి!

థియేటర్లలో ఇకపై నూరు శాతం ఆక్యుపెన్సీ

పుష్ప షూట్‌.. బన్నీ ఎమోషనల్‌..!

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని