అలాంటి చిత్రాల్లో ‘వకీల్‌సాబ్’ ఒకటి: చరణ్‌ - vakeel saab yet another landmark film for pawan kalyan: ramcharan
close
Published : 11/04/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలాంటి చిత్రాల్లో ‘వకీల్‌సాబ్’ ఒకటి: చరణ్‌

ఇంటర్నెట్‌ డెస్క్: పవన్‌ కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వకీల్‌సాబ్’. శ్రుతిహాసన్‌ కథానాయిక. నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. బోనీ కపూర్ సమర్పణలో వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాంకపై దిల్‌రాజ్‌ నిర్మించారు. సినిమా ఏప్రిల్‌ 9న విడుదలై ప్రేక్షకుల్ని అలరిస్తోంది. తాజాగా ఈ సినిమాపై నటుడు రామ్‌చరణ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు.

‘‘కొందరు తెరపై అలా నటిస్తుంటే ఆ సన్నివేశాలు చూసేటప్పుడు ఆనందించడం మాత్రమే కాదు, ఆ సినిమా చూసిన తర్వాత వాటి ప్రభావం మనపై ఉంటుంది. కల్యాణ్ బాబాయి అందులో మీ ‘వకీల్ సాబ్‌’ ఒకటి. ప్రకాష్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్య, అందరూ బాగా నటించారు. తమన్ నేపథ్య సంగీతం, పిఎస్ వినోద్ గారు అద్భుతమైన కెమెరా పనితనం. వేణు శ్రీరామ్ గారు, మాకు ‘వకీల్‌సాబ్’ని ఇచ్చినందుకు ధన్యవాదాలు, దిల్ రాజుగారు, శిరీష్ గారు అందరికీ ధన్యవాదాలు ” అంటూ పేర్కొన్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని