Vishal 31: విశాల్ యాక్ష‌న్ హంగామా - vishal new film vishal 31 fight scenes directed by saravanan
close
Published : 17/06/2021 14:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vishal 31: విశాల్ యాక్ష‌న్ హంగామా

ఇంట‌ర్నెట్ డెస్క్‌: న‌టుడు విశాల్ త‌న కొత్త చిత్రం ‘విశాల్ 31’ని (వ‌ర్కింగ్ టైటిల్‌) ఇటీవ‌ల‌ పునః ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న‌ సినిమా ఇది. లాక్‌డౌన్‌కి ముందు కొద్దిభాగం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్‌ కొన్ని రోజుల క్రిత‌మే రామోజీ ఫిలింసిటీలో మ‌ళ్లీ మొద‌లైంది. ప్ర‌స్తుత షెడ్యూల్‌లో పోరాట స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా వాటికి సంబంధించిన‌ మేకింగ్ వీడియోని అభిమానుల‌తో పంచుకున్నాడు విశాల్. ఓ దాబా నేపథ్యంలో సాగే యాక్ష‌న్ సీన్ ఇది. ఇందులో విల‌న్ గ్యాంగ్ విశాల్‌ని సీసాల‌తో దాడి చేసే దృశ్యాలు చూడొచ్చు. రియ‌ల్ స్టంట్ చేయ‌డంతో విశాల్ కంటికి కొంచెం గాయ‌మైనట్టు క‌నిపిస్తోంది. ఫైట్ మాస్ట‌ర్ ర‌వివ‌ర్మ నేతృత్వంలో ఈ స‌న్నివేశాలు రూపొందుతున్నాయి. జులై చివ‌రికి ఈ సినిమాని పూర్తి చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. ఈ సినిమాలో విశాల్ స‌ర‌స‌న డింపుల్ హ‌యాతీ న‌టిస్తోంది. 

 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని