మోదీజీ.. మీ దయాగుణానికి కృతజ్ఞతలు - west indies former cricketers thanked indian government and pm modi over vaccine distribution
close
Published : 15/03/2021 19:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోదీజీ.. మీ దయాగుణానికి కృతజ్ఞతలు

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీకి విండీస్‌ మాజీ క్రికెటర్లు కృతజ్ఞతలు చెప్పారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొంనేందుకు భారత శాస్త్రవేత్తలు సమర్థమైన టీకాలను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు దేశాలకు భారత ప్రభుత్వం ‘వాక్సిన్‌ మైత్రి’ పేరిట టీకాలను అందిస్తోంది. ఇటీవల కరీబియన్‌ ప్రాంతాలైన ఆంటిగ్వా, బార్బుడాకు సైతం కేంద్రం.. 1,75,000 టీకా డోసులను పంపిణీ చేసింది. ఈ నేపథ్యంలోనే విండీస్‌ మాజీ క్రికెటర్లు ప్రధానికి ఓ వీడియో సందేశంలో కృతజ్ఞతలు చెప్పారు. కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో ఆ వీడియో ట్విటర్‌లో పంచుకోగా, అందులో దిగ్గజ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌తో పాటు మరికొంత మంది స్పందించారు. 

* మా దేశం కోసం టీకాలను అందించి ఎంతో మంచి పనిచేసిన భారత్‌కు ధన్యవాదాలు. ఆంటిగ్వా, బార్బుడా ప్రాంత ప్రజల తరఫున కృతజ్ఞతలు. భవిష్యత్‌లోనూ మన బంధం ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నా. ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి, ఇండియా హైకమిషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. -సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌

* ఇక్కడి ప్రభుత్వం, ప్రజల తరఫున భారత ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. మా కోసం 40 వేల వాక్సిన్లు పంపిణీ చేశారు. మేం మీ దేశానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. -రిచర్డ్‌సన్‌

* ప్రపంచవ్యాప్తంగా అందరికీ టీకాలు అందిస్తున్న భారత ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. మా జమైకా ప్రాంతం ఈ వాక్సిన్ల ద్వారా లాభపడుతుందని నేను విశ్వసిస్తున్నా. కరీబియన్‌ ప్రజల తరఫున భారత దేశానికి, అక్కడి ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.  -జిమ్మీ ఆడమ్స్‌

* గుయానాకు కరోనా వాక్సిన్లు అందించిన భారత ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు. మీ దయాగుణం, సహృదయాన్ని అభినందిస్తున్నాం. ధన్యవాదాలు. -రామ్‌నరేశ్‌ శర్వాన్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని