close
టాలీవుడ్‌
చిత్రీకరణలో భాగంగానే సిగరెట్‌ కాల్చా

పాట చిత్రీకరణలో భాగంగానే సిగరెట్‌ కాల్చానని... అయినప్పటికీ చట్టాన్ని గౌరవించే ఓ పౌరుడిగా జరిమానా కట్టానని కథా నాయకుడు రామ్‌ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసినందుకుగానూ ఆయనకి సోమవారం చార్మినార్‌ పోలీసులు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఆ విషయంపై రామ్‌ మంగళవారం స్పందించారు. ‘‘షాట్‌లో భాగంగా కాల్చాను తప్ప, విరామం సమయంలో కాదు. సినిమాలోని పాటలో కూడా ఆ సన్నివేశాల్ని చూస్తారు. నా సమయం, జనం సమయం వృథా చేయడం ఇష్టం లేకే సోమవారం స్పందించలేదు’’ అని ట్వీటారాయన. పూరి  జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. ఆ సినిమాలోని టైటిల్‌ గీతాన్నే చార్మినార్‌  పరిసరాల్లో చిత్రీకరించారు.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.