Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 173539
            [news_title_telugu_html] => 

ప్రతి మలుపుకీ చప్పట్లు కొడుతున్నారు

[news_title_telugu] => ప్రతి మలుపుకీ చప్పట్లు కొడుతున్నారు [news_title_english] => [news_short_description] => ‘‘మేం అనుకొన్నట్టుగానే మా సినిమాలోని ప్రతి జోక్‌కీ ప్రేక్షకులు నవ్వుతున్నారు, ప్రతి మలుపుకీ చప్పట్లు కొడుతున్నార’’న్నారు అడివి శేష్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఎవరు’. రెజీనా కథానాయిక. రామ్‌జీ దర్శకత్వం వహించారు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,2, ) )
ప్రతి మలుపుకీ చప్పట్లు కొడుతున్నారు - EENADU
close
టాలీవుడ్‌
ప్రతి మలుపుకీ చప్పట్లు కొడుతున్నారు

‘‘మేం అనుకొన్నట్టుగానే మా సినిమాలోని ప్రతి జోక్‌కీ ప్రేక్షకులు నవ్వుతున్నారు, ప్రతి మలుపుకీ చప్పట్లు కొడుతున్నార’’న్నారు అడివి శేష్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఎవరు’. రెజీనా కథానాయిక. రామ్‌జీ దర్శకత్వం వహించారు. పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కెవిన్‌ అన్నె నిర్మాతలు. గురువారం విడుదలైన ఈ   చిత్రానికి లభిస్తున్న స్పందన పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. నైజాంలో చిత్రాన్ని పంపిణీ చేసిన నిర్మాత దిల్‌రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అడివి శేష్‌ మాట్లాడుతూ ‘‘దిల్‌ రాజు నిర్మించిన ‘ఎవడు’ సినిమాకీ, ఈ ‘ఎవరు’కి ఒక లింక్‌ ఉంది. ‘ఎవడు’లో నేను ప్రతినాయకుడిగా నటించాలని ప్రయత్నించా. కానీ కుదరలేదు. అప్పుడు నేనా స్థాయికి ఎదగలేదు కూడా. ‘ఎవరు’ చూశాక దిల్‌రాజు ఫోన్‌ చేసి ‘నా సంస్థలో సినిమా ఎప్పుడు చేద్దాం’ అని అడిగారు. అది నాకు బాగా సంతోషాన్నిచ్చిన విషయం. ‘గూఢచారి’ కంటే మూడు రెట్లు ఎక్కువ వసూళ్లతో ఈ సినిమా ప్రారంభమైంది’’ అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘మన దగ్గర ప్రతిభ ఉంటే ఏదైనా చేసి అనుకొన్నది సాధించొచ్చని ఈ తరానికి చెప్పిన నటుడు శేష్‌. నటుడిగా తనని తాను   నిరూపించుకొన్నాడు. తను చేసిన ‘ఎవరు’ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇన్ని మలుపులతో ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసిన ఇలాంటి సినిమా ఈమధ్య కాలంలో రాలేదు. మేం నైజాంలో విడుదల చేసినందుకు ఆనందంగా ఉంది. మా సంస్థలో సినిమా చేయమని శేష్‌ని ఆహ్వానిస్తున్నా. ఇలాంటి కాన్సెప్టులతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అన్నారు. రెజీనా మాట్లాడుతూ ‘‘సీటు అంచున కూర్చుని చూసే సినిమా అంటుంటారు కదా, అలాంటి అనుభవాన్ని వందశాతం ఇస్తున్న చిత్రమిది. థియేటర్లలో సినిమాని ఆస్వాదిస్తున్న ప్రేక్షకుల్ని చూసినప్పుడు చక్కటి అనుభూతి కలిగింది’’ అన్నారు.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.