Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 176045
            [news_title_telugu_html] => 

చరిత్ర మనతోనే మొదలవ్వాలి

[news_title_telugu] => చరిత్ర మనతోనే మొదలవ్వాలి [news_title_english] => [news_short_description] => తెలుగు చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయి సినిమాలకి చిరునామాగా మారిపోయింది. అత్యున్నత సాంకేతిక హంగులు, భారీ వ్యయంతో వరుసగా సినిమాలు రూపొందుతున్నాయి. అందులో ‘సైరా నరసింహారెడ్డి’ ఒకటి. చిరంజీవి కథానాయకుడిగా నటించిన 151వ చిత్రమిది. బ్రిటిష్‌ పాలకులపై తిరుగుబాటు బావుటా [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/watch?v=qZoWxaz2YPc [news_videoinfo] => |https://www.youtube.com/watch?v=qZoWxaz2YPc [news_sections] => ,2, ) )
చరిత్ర మనతోనే మొదలవ్వాలి - EENADU
close
టాలీవుడ్‌
చరిత్ర మనతోనే మొదలవ్వాలి

తెలుగు చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయి సినిమాలకి చిరునామాగా మారిపోయింది. అత్యున్నత సాంకేతిక హంగులు, భారీ వ్యయంతో వరుసగా సినిమాలు రూపొందుతున్నాయి. అందులో ‘సైరా నరసింహారెడ్డి’ ఒకటి. చిరంజీవి కథానాయకుడిగా నటించిన 151వ చిత్రమిది. బ్రిటిష్‌ పాలకులపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన తొలి యోధుడు ఉయ్యాలవాడ  నరసింహారెడ్డి జీవిత కథతో రూపొందుతోంది. సురేందర్‌ రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ అగ్ర నటుడు అమితాబ్‌ బచ్చన్‌తోపాటు దక్షిణాదికి చెందిన పలువురు ప్రముఖ నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. హిందీతో పాటు దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ చిత్రాన్ని అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గురువారం చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా మంగళవారం ముంబయిలో ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్‌ని విడుదల చేశారు. ‘రేనాటి వీరులారా... చరిత్రలో మనం ఉండకపోవచ్చు. కానీ చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి’ అంటూ చిరంజీవి చేసిన సందడి ప్రేక్షకుల్ని అలరిస్తోంది. టీజర్‌ విడుదల కార్యక్రమంలో చిత్రబృందం చెప్పిన విషయాలివీ...

కల నెరవేరింది

- చిరంజీవి

‘‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం గురించి చాలా మందికి తెలియదు. దేశం కోసం పోరాటం చేసిన ఆయన గురించి భారతీయులంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పదేళ్ల కిందటే నా దృష్టికి వచ్చిందీ కథ. కానీ నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని ధైర్యం  చేయలేకపోయా. నిర్మాత రామ్‌చరణ్‌, దర్శకుడు సురేందర్‌రెడ్డి ముందుకు రావడంతో ఎట్టకేలకి నా కల నెరవేరింది. హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో విడుదల చేస్తున్నాం. సినిమాలో నటించేటప్పుడు మేకప్‌కే గంట సమయం పట్టేది. పోరాట ఘట్టాల కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. నాకు అప్పటికే  భుజానికి గాయం అయ్యింది. ఆపరేషన్‌ కూడా జరిగింది. కానీ యాక్షన్‌ ఘట్టాల కోసం గుర్రపుస్వారీ, కత్తియుద్ధాలు చేయాల్సి వచ్చింది. కష్టపడటం ఇష్టం కావడంతో ఈ సినిమా ప్రయాణాన్ని ఆస్వాదించా. ఉదయం 4 గంటలకే లేచి వ్యాయామం చేసి సెట్‌కి వెళ్లేవాణ్ని. 7 గంటలకే చిత్రీకరణ మొదలుపెట్టేవాళ్లం. నా క్రమ శిక్షణని చూసి, ‘మీరిలా వెళితే మన అబ్బాయికి చెడ్డ పేరు వస్తుంద’ని నా భార్య చమత్కరించేది. 2007లో నేను నటించడం ఆపేశా. తిరిగి 2016లో మొదలుపెట్టా. అప్పటికే చాలా మార్పులు కనిపించాయి. 150వ సినిమాని నేనొక కొత్త నటుడిలాగే చేశా. కంటెంట్‌, భావోద్వేగాల పరంగా మాత్రం మార్పులేమీ కనిపించలేదు. అమితాబ్‌ బచ్చన్‌ నా నిజ జీవిత మార్గదర్శి. ఒకే ఒక్క మెగాస్టార్‌ ఉన్నారని, ఆయన అమితాబ్‌ బచ్చన్‌ అని నమ్ముతుంటా. ఆయనతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం’’.

నిర్మాతని మాత్రమే 
- రామ్‌చరణ్‌

‘‘ఈ చిత్రానికి నేను నిర్మాతని మాత్రమే. మంచి కథ కాబట్టి ‘సైరా..’ని హిందీతో పాటు పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఈచిత్రం కోసం నాన్న ఎంతో శ్రమించారు. హిందీలో మంచి కథ వస్తే నేను నటించడానికి సిద్ధమే. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’తో మళ్లీ హిందీ ప్రేక్షకుల ముందుకొస్తా. ప్రస్తుతం ఆ సినిమా చిత్రీకరణలో ఉన్నా’’.

తెలుసుకోవల్సిన కథ ఇది
- తమన్నా

‘‘భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలోని ఒక ముఖ్యమైన కథ ఇది.  కచ్చితంగా తెలుసుకోవల్సిన కథ. నా పాత్ర భిన్నంగా ఉంటుంది. దక్షిణాదిలో కెరీర్‌ మొదలుపెట్టినప్పటి నుంచీ చిరంజీవితో కలిసి నటించాలనే కోరిక ఉండేది. ఈ చిత్రంతో ఆ కల నెరవేరింది’’.

గుర్తుపట్టలేకపోయాం: సుదీప్‌

‘‘ఈ సినిమా కోసం మేకప్‌ వేసుకొని అద్దం ముందుకు వెళ్లిన ప్రతిసారీ ఇక్కడ నేనేనా లేక వేరే వ్యక్తిని చూస్తున్నానా అనిపించేది. యుద్ధ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు మా పక్కన ఉన్న నటులను గుర్తుపట్టలేకపోయేవాళ్లం. వాళ్లెవరో తెలుసుకోవడానికి సమయం పట్టేది’’.

రేనాటి సూర్యుడు

‘సైరా..’ తెలుగు టీజర్‌ పవన్‌ కల్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌తో మొదలైంది. శక్తిమంతమైన సంభాషణలు, భారీ యుద్ధ సన్నివేశాలతో సినిమా స్థాయిని తెలియజేసింది.. 1 నిమిషం 47 సెకన్ల ఆ టీజర్‌. పవన్‌కల్యాణ్‌, చిరంజీవి చెప్పిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. ‘‘చరిత్ర స్మరించుకుంటుంది ఝాన్సీ లక్ష్మీభాయ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, భగత్‌ సింగ్‌ లాంటి ఎందరో  మహనీయుల ప్రాణ త్యాగాల్ని. కానీ ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు. ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యుడు’’ అంటూ పవన్‌ కల్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌ చెప్పారు. ‘రేనాటి వీరులారా...’ అంటూ చిరంజీవి సంభాషణ సాగుతుంది. ఆయన పోరాట ఘట్టాల్లో కనిపించిన విధానం అలరించింది. చిరంజీవి, అమితాబ్‌ల సహకారంతో సినిమాని సులభంగా పూర్తి చేశానని దర్శకుడు సురేందర్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయ్‌ సేతుపతి, రవికిషన్‌, సంగీత  దర్శకుడు అమిత్‌ త్రివేది, హిందీలో విడుదల చేస్తున్న ఫర్హాన్‌ అక్తర్‌, రితేష్‌ సిద్వాని, అనిల్‌ టడానీ తదితరులు పాల్గొన్నారు. టీజర్‌ విడుదల కార్యక్రమం కోసం ముంబయికి వెళ్లిన చిరంజీవి, రామ్‌చరణ్‌ని... అక్కడే ‘సాహో’ ప్రచార కార్యక్రమాల్లో ఉన్న ప్రభాస్‌ కలుసుకొన్నారు.

 

 

 


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.