ఉదయం ఆట ఉచితం - Telugu News The Killer Released On September 3
close
Updated : 26/08/2021 07:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉదయం ఆట ఉచితం

కార్తీక్‌సాయి హీరోగా పరిచయం అవుతూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ది కిల్లర్‌’. డాలీషా, నేహాదేశ్‌పాండే నాయికలు. ఆవుల రాజుయాదవ్‌, సంకినేని వాసుదేవరావు నిర్మాతలు. ఈ సినిమా సెప్టెబరు 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ముందస్తు విడుదల వేడుక జరిగింది. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హాజరయ్యారు. ఆయన ట్రైలర్‌ని విడుదల చేయగా, కథానాయకుడు సోహైల్‌ బిగ్‌ టికెట్‌ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతిభ కలిగిన చాలా మంది సినిమా రంగంలోకి అడుగు పెడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ రంగానికి ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారు’’ అన్నారు. కార్తీక్‌సాయి మాట్లాడుతూ ‘‘విడుదల రోజు ఉదయం ఆట అన్ని కేంద్రాల్లో ఉచితంగా చూడొచ్చు. చూశాక సినిమా గురించి పదిమందికి చెప్పాలని ప్రేక్షకుల్ని కోరుతున్నా’’ అన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని