
మొన్న నాన్న కోసం.. నేడు అమ్మ కోసం..
హైదరాబాద్: స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ‘సైరా’ చిత్రం తీసి, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కలను నిజం చేశారు రామ్ చరణ్. ఇప్పుడు తన తల్లి సురేఖ కల నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. చిరు కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ కథానాయిక. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రంలో దాదాపు 30 నిమిషాల నిడివిగల అతిథి పాత్ర ఉందని, అందులో మహేశ్‌బాబు నటించబోతున్నారని తొలుత ప్రచారం జరిగింది. తొలుత ఒప్పుకున్న ఆయన, కొన్ని కారణాల వల్ల తర్వాత తప్పుకున్నట్లు తెలిసింది. ఆ పాత్రను చెర్రీ పోషించబోతున్నారనే టాక్ ఉంది. ఇదే ప్రశ్న తాజాగా ఓ ఆంగ్ల పత్రిక చరణ్‌ను అడిగింది. దీనికి ఆయన స్పందిస్తూ.. నటించబోతున్నానని స్పష్టం చేశారు.
‘స్టార్డమ్, ప్రేక్షకుల అభిమానం.. ఇవన్నీ మా నాన్న వల్ల నాకు వచ్చినవే. అలాంటి ఆయనతో కలిసి వెండితెరను పంచుకోవడం నా అదృష్టం. 2015లో నేను నటించిన ‘బ్రూస్లీ’ చిత్రంలో నాన్న ప్రత్యేక పాత్రలో నటించారు. అదేవిధంగా ‘ఖైదీ నెంబర్ 150’లోని పాటలో నేను నాన్నతో కలిసి స్టెప్పులేశా. ఇప్పుడు ‘ఆచార్య’లో మళ్లీ కలిసి తెరపై కనిపిస్తాం’ అని ఆయన చెప్పారు.
అనంతరం తన తల్లి సురేఖ కోరిక గురించి ముచ్చటిస్తూ.. ‘నేను, నాన్న కలిసి తెరపై పూర్తిస్థాయి పాత్రల్లో కనిపించాలనేది మా అమ్మ కల. ‘ఆచార్య’లో మా కాంబినేషన్ అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నా’ అని చెర్రీ పేర్కొన్నారు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- మదనపల్లె కేసు: రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు
- ‘బిడ్డలిద్దరూ శివపార్వతులు.. నేను కాళికను’
- RRR రిలీజ్.. ఇది అన్యాయం: బోనీకపూర్
- థాంక్యూ.. టీమ్ఇండియా అంటున్న లైయన్
- మదనపల్లె ఘటన.. ఆహారం తీసుకోని నిందితులు
- ‘మిమ్మల్ని కోర్టుకు పిలవడం ఇబ్బందిగా ఉంది’
- విశాఖ: వంట నూనెల కంపెనీలో అగ్నిప్రమాదం
- ‘హెచ్1బీ’ భాగస్వాములకు బైడెన్ గుడ్‌న్యూస్!
- పృథ్వీ షా.. ఈ రెండు పనులు వెంటనే చేసెయ్!
- 21 ఏళ్లకే వ్యాపార పాఠాలు!