నాకు పెన్షన్‌ ఇవ్వండి: నటుడు సంపత్‌ - actor sampath raj interview about check movie
close
Published : 26/02/2021 12:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాకు పెన్షన్‌ ఇవ్వండి: నటుడు సంపత్‌

‘‘ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా సాగే చిత్రం ‘చెక్‌’. స్క్రీన్‌ప్లే, ముగింపులో వచ్చే మలుపులు సినీప్రియుల్ని మెప్పిస్తాయి. ఒక మంచి సినిమా చూసిన అనుభూతి పంచుతాయ’’న్నారు నటుడు సంపత్‌ రాజ్‌. ‘మిర్చి’, ‘రన్‌ రాజా రన్‌’, ‘భీష్మ’ వంటి విజయవంతమైన చిత్రాల్లో.. వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన  నటుడాయన. ఇప్పుడు నితిన్‌ ‘చెక్‌’ చిత్రంలోనూ ఓ కీలక పాత్రలో నటించారు. చంద్రశేఖర్‌ యేలేటి     దర్శకుడు. వి.ఆనంద ప్రసాద్‌ నిర్మాత. శుక్రవారం  విడుదలైంది. ఈ నేపథ్యంలోనే చిత్ర విశేషాలు పంచుకున్నారు సంపత్‌.

‘‘నేనిప్పటి వరకు నటించిన చిత్రాల్లో పూర్తి భిన్నమైనది ఇదే. నేనిందులో పోలీస్‌ అధికారిగా కనిపిస్తా. ‘భీష్మ’లో నా పోలీస్‌ పాత్రకి పూర్తి భిన్నంగా ఉంటుంది. నితిన్‌ ఉరిశిక్ష పడిన ఖైదీగా కనిపిస్తారు. నాకు హీరోపై పగ ఉంటుంది. అందుకే అతనికి ఉరిశిక్ష వేయాలనే లక్ష్యంతో జీవిస్తుంటా. అయితే అతని జీవితంలో మరో అంశం ఉంటుంది. దాని వల్ల  అతనికి ఉరి పడిందా? లేదా? అన్నది మిగతా చిత్ర కథ. ఈ సినిమా చేయడం ద్వారా ఖైదీ జీవితాన్ని దగ్గరగా చూడగలిగా’’.

‘‘చెక్‌’ క్లైమాక్స్‌ చాలా బాగుంటుంది. ముగింపులోనే దర్శకుడి తెలివి ప్రేక్షకులకి తెలుస్తుంది. ప్రస్తుతం ‘ఎఫ్‌3’లోనూ పోలీస్‌గా చేస్తున్నా. నేనెక్కువ పోలీస్‌ పాత్రల్లో నటిస్తున్నా కదా.. అందుకే ‘నాకు పెన్షన్‌ ఇవ్వండ’ని తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్‌లకు ఓ లెటర్‌ రాద్దామనుకుంటున్నా (నవ్వుతూ)’’ అన్నారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని