అక్షయ్‌ కుమార్‌.. మరోసారి దేవుడిగా! - bollywood actor akshay kumar playing god role
close
Published : 20/07/2021 11:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్షయ్‌ కుమార్‌.. మరోసారి దేవుడిగా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అక్షయ్‌కుమార్‌ మరోసారి వెండితెరపై దేవుడిగా దర్శనం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన, పరేష్‌రావల్, మిథున్‌ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఓఎమ్‌జీ: ఓ మై గాడ్‌’ మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో వెంకటేష్, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రల్లో ‘గోపాలగోపాల’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘ఓఎమ్‌జీ’ చిత్రానికి కొన సాగింపుగా ‘ఓఎమ్‌జీ 2’ రానుంది. పంకజ్‌ త్రిపాఠి, యామీ గౌతమ్‌ ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. ఈ చిత్రంలోనూ దేవుడి పాత్రలో అక్షయ్‌ నటించబోతున్నట్టు తెలుస్తోంది. దీని కోసం ఆయన పదిహేను రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొననున్నారు. అమిత్‌ రాయ్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ఆగస్టు నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని