విభిన్నమైన థ్రిల్లర్‌ ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ - cinema
close
Published : 14/05/2021 15:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విభిన్నమైన థ్రిల్లర్‌ ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’

‘118’ చిత్రంతో తొలి అడుగులోనే దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నారు కేవి గుహన్‌. ఇప్పుడాయన నుంచి వస్తున్న రెండో సినిమా ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’. ఎవరు, ఎక్కడ, ఎందుకు.. ఉపశీర్షిక. అదిత్‌ అరుణ్‌, శివాని రాజశేఖర్‌ జంటగా నటిస్తున్నారు. రవి.పి.రాజు దాట్ల నిర్మాత. సైమన్‌.కె.కింగ్‌ స్వరాలందిస్తున్నారు. బుధవారం ఈ చిత్రం నుంచి ‘హు వేర్‌ వై’ అనే ర్యాప్‌ వీడియో గీతాన్ని విడుదల చేశారు. దీనికి రోల్‌ రైడా సాహిత్యం అందించడంతో పాటు స్వయంగా ఆలపించారు. ప్రస్తుతం కొవిడ్‌ వల్ల ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో వారిలో ధైర్యాన్ని నింపేందుకు ఈ పాటను తీసుకొచ్చినట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘తెలుగులో వస్తున్న తొలి కంప్యూటర్‌ స్క్రీన్‌ చిత్రమిది. థ్రిల్లర్‌ జానర్‌లోనే ఓ విభిన్నమైన సినిమాగా నిలుస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు.Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని