అలరిస్తున్న రకుల్‌-అర్జున్‌ల ‘దిల్‌ నహీ తోడ్నా’ సాంగ్‌   - dil nahin todna lyrical song sardar ka grandson arjun rakul preet
close
Updated : 29/05/2021 19:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలరిస్తున్న రకుల్‌-అర్జున్‌ల ‘దిల్‌ నహీ తోడ్నా’ సాంగ్‌  

ఇంటర్నెట్‌ డెస్క్: అర్జున్‌ కపూర్‌, రకుల్ ప్రీత్‌సింగ్‌ కలిసి జంటగా నటించిన చిత్రం ‘సర్దార్ కా గ్రాండ్‌సన్‌’. కాశ్వీ నాయర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నుంచి ‘దిల్ నహీ తోడ్నా’ అనే లిరికల్‌ వీడియో సాంగ్‌ ఆకట్టుకుంటోంది. ఈ పాటకి తనీష్క్ బాగ్చి సాహిత్యం అందించగా, జరాఖాన్, తనిష్క్ ఆలపించారు. బాగ్చి సంగీత స్వరాలు సమకూర్చారు. విదేశాల నుంచి భారత్కి‌ తిరిగివచ్చిన ఓ యువకుడు (అర్జున్‌ కపూర్‌) తన బామ్మ (నీనా గుప్త) చివరి కోరికను తీర్చడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే కుటుంబ ఆత్మీయ నేపథ్య కథగా చిత్రం తెరకెక్కింది. ఇందులో జాన్ అబ్రహం, అదితి రావు హైదరీ, సోని రజ్దాన్, కుముద్ మిశ్రా, దివ్య సేథ్ తదితరులు నటించారు. టి-సిరీస్ ఫిల్మ్స్, ఎమ్మే ఎంటర్‌టైన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా రూపొందించాయి. భూషణ్ కుమార్, దివ్య ఖోస్లా కుమార్, మోనిషా అద్వాణీ నిర్మాతలు. చిత్రం మే 18న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా విడుదలైంది.  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని