సూర్య..‘జై భీమ్‌’
close
Published : 24/07/2021 02:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సూర్య..‘జై భీమ్‌’

థానాయకుడు సూర్య.. దర్శకుడు టి.ఎస్‌.జ్ఞానవేల్‌ కలయికలో ఓ సినిమా రూపొందుతోంది. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘జై భీమ్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. శుక్రవారం సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో సూర్య న్యాయవాదిగా నల్లకోటు ధరించి.. సీరియస్‌ లుక్‌లో కనిపించారు. బ్యాగ్రౌండ్‌లో న్యాయస్థానం, కొంతమంది గిరిజనుల్ని చూపించారు. ఈ ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి.. సూర్య ఇందులో గిరిజనుల తరఫున పోరాడే న్యాయవాదిగా కనిపించనున్నారని అర్థమవుతోంది. ఇది ఆయన నటిస్తున్న 39వ చిత్రం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ‘ఆకాశం నీ హద్దురా’ లాంటి హిట్‌ తర్వాత సూర్య నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. కొత్త లుక్కుతో..: సూర్య నటించనున్న 40వ సినిమాకి ‘ఎతరెక్కుమ్‌ తునింధవన్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. పాండిరాజ్‌ దర్శకుడు. కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్‌ కథానాయిక. శుక్రవారం ఈ సినిమా నుంచి సెకండ్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సూర్య విలన్లను వేటాడి చేతిలో కత్తి పట్టుకుని కోపంగా చూస్తూ కనిపించారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని