Cinema News: ఆమె ప్రేమలో అతడు - telugu news first look poster Of Athadu aame Priyudu Launched
close
Updated : 25/10/2021 07:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: ఆమె ప్రేమలో అతడు

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’. సునీల్‌, కౌశల్‌, బెనర్జీ ముఖ్యపాత్రధారులు. రవి  కనగాల, రామ్‌ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఝాన్సీ కూనం  సమర్పిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకుని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుకొంటోందీ సినిమా. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘నేను దర్శకత్వం వహించిన ‘ఆఖరి పోరాటం’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రాల రచయితైన యండమూరి వీరేంద్రనాథ్‌ దర్శకుడిగా ఇప్పటికే తన ప్రత్యేకతని చాటారు. ‘అతడు ఆమె ప్రియుడు’ ఘన విజయం సాధించి, నిర్మాతలకి మంచి లాభాల్ని తెచ్చిపెట్టాలి. లుక్‌ బాగుంద’’ని మెచ్చుకున్నారు. యండమూరి మాట్లాడుతూ ‘‘కె.రాఘవేంద్రరావు నాకు గురువులాంటివారు. భారతదేశం గర్వించదగిన దర్శకుడు. ఆయన మా సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అంబికారా రాజా, హీరోయిన్‌ మహేశ్వరి, అమర్‌, భూషణ్‌ తదితరులు పాల్గొన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని