AP News: చిక్కీల్లో పురుగులు
close
Updated : 22/06/2021 07:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP News: చిక్కీల్లో పురుగులు

జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చిన చిక్కీ ప్యాకెట్‌లో పురుగులు

గనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాడులోని బీవీఆర్‌ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం పంపిణీ చేసిన వేరుశెనగ చిక్కీలలో ముక్కు పురుగులు కన్పించాయి. దీంతో వారందరూ కంగుతిన్నారు. పాఠశాలలో 660 మంది విద్యార్థులు చదువుతుండగా.. గతేడాది సెప్టెంబరు నుంచి జనవరి 2021 వరకు ఐదు నెలలకు సంబంధించి రెండు ప్యాకెట్ల చొప్పున వేరుశనగ చిక్కీలను అందజేశారు. ఇంటికి తీసుకెళ్లి వాటిని పరిశీలించగా.. ప్యాకెట్టులో పురుగులు పాకుతూ కనిపించాయి. ప్యాకెట్‌పై జనవరి 16, 2021న తయారు చేసినట్లు ఉంది. దీని గడువు 60 రోజులు కాగా... ఈ ప్రకారం మార్చి 16లోపు వినియోగించాలని తయారీదారులు చెబుతున్నారు. గడువు ముగిసిన చిక్కీల వితరణపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- ప్రత్తిపాడు, న్యూస్‌టుడే


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని