లాక్‌డౌన్‌ తర్వాత ‘దక్ష’ ఫైనల్‌ షూట్‌ - daksha shooting will resume after lockdown complete
close
Published : 04/06/2021 17:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌ తర్వాత ‘దక్ష’ ఫైనల్‌ షూట్‌

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌లో తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం ‘దక్ష’. వివేకానంద విక్రాంత్ తొలిసారి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు శరత్‌బాబు కుటుంబం నుంచి ఆయుష్ హీరోగా పరిచయమవుతున్నాడు. అరకు, ఖమ్మం, హైదరాబాద్‌లలో మూడు షెడ్యూలు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ లాక్‌డౌన్‌ తర్వాతే ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా దర్శకుడు వివేకానంద విక్రాంత్ మాట్లాడుతూ థ్రిల్లర్ కథనంతో తెరకెక్కుతున్న ఈ సినిమా 70శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని తెలిపారు. ప్రస్తుతం కొవిడ్ కారణంగా సినిమా షూటింగ్‌ నిలిపివేశామని, లాక్‌డౌన్‌ తర్వాత వ్యాక్సిన్స్ వేసుకొని అన్నిజాగ్రత్తలతో షూటింగ్ నిర్వహిస్తామన్నారు.

నిర్మాత తల్లాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘కరోనా సెకండ్ వేవ్ కారణంగా రోజుకో వార్త చూస్తున్నాం, అత్యవసర పరిస్థితిలో మాత్రమే ప్రజలు బయటకి వెళ్ళి రావాలి. విక్రాంత్ ఎంచుకున్న కథ టెక్నికల్‌గా చాలా విభిన్నంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా ని థియేటర్లోనే విడుదల చేస్తాం.  ఇలాంటి సినిమాలు థియేటర్‌లోనే చూస్తేనే ఫీల్ బాగుంటుంది’ అన్నారు. ఆయుష్, నక్షత్ర, అను, రియా, అఖిల్, రవి రెడ్డి, శోభన్ బాబు, పవన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని