Keerthy Suresh: కీర్తి సినిమాపై క్లారిటీ - producer clarifies about release of goodluck sakhi
close
Published : 07/06/2021 13:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Keerthy Suresh: కీర్తి సినిమాపై క్లారిటీ

నిర్మాత ఏమన్నారంటే

హైదరాబాద్‌: నటి కీర్తిసురేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘గుడ్‌లక్‌ సఖి’ సినిమా విడుదలపై కొంతమేర స్పష్టత లభించింది. ప్రస్తుతానికి తమ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసే ఆలోచన లేదని నిర్మాత సుధీర్‌ చంద్రా తెలిపారు. ‘మేము తెరకెక్కించిన ‘గుడ్‌లక్‌ సఖి’ చిత్రం ఓటీటీలో విడుదల కానుందంటూ గత కొన్నిరోజులుగా ఆన్‌లైన్‌తోపాటు పలు పత్రికల్లో వరుస కథనాలు దర్శనమిస్తున్నాయి. ఇకపై ఇలాంటి కథనాలను నిలిపివేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. సినిమా విడుదలపై ఏదైనా సరికొత్త సమాచారం ఉంటే తప్పకుండా మీకు తెలియజేస్తా’ అని సుధీర్‌ పేర్కొన్నారు.

గ్రామీణ క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం ‘గుడ్‌లక్‌ సఖి’. కీర్తిసురేశ్‌, ఆది పినిశెట్టి, జగపతిబాబు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. నాగేశ్‌ కుకునూర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావించింది. లాక్‌డౌన్‌ కారణంగా గత కొన్నిరోజుల నుంచి థియేటర్లు మూసివేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే పలు చిత్రాలు ఇప్పటికే ఓటీటీ ఫ్లాట్‌ఫాట్స్‌ వేదికగా విడుదలై ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. ‘గుడ్‌లక్‌ సఖి’ సైతం అదే బాటలో అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉందంటూ ఇటీవల వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే చిత్ర నిర్మాత స్పందించారు.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని