Rajinikanth: అరకోటి విరాళం - rajinikanth meets mk stalin donates rs 50
close
Published : 17/05/2021 14:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rajinikanth: అరకోటి విరాళం

ఇంటర్నెట్‌ డెస్క్:  దేశంలో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. నిత్యం దాదాపు 3 లక్షలకుపైగా కేసులు.. 4 వేలకుపైగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు తమవంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. తమిళనాడు ముఖ్యమంత్రి  ఎంకే స్టాలిన్‌ను కలిసి సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇప్పటికే ఎంతోమంది తమిళ సినీ ప్రముఖులు తమవంతు సాయంగా కొవిడ్‌పై పోరాటానికి విరాళం అందజేసిన విషయం తెలిసిందే.

విక్రమ్‌ రూ.30లక్షలు

మరోవైపు నటుడు విక్రమ్‌ కూడా కరోనా రిలీఫ్‌ ఫండ్‌కు తనవంతు సాయం చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా రూ.30లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేశారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని