close
Published : 17/04/2021 14:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Sonu soodకి కరోనా పాజిటివ్‌

ముంబయి: రియల్‌ హీరో, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శనివారం సోనూ ఓ ట్వీట్‌ పెట్టారు. ‘ఈరోజు ఉదయం నాకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రస్తుతం నేను స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. తగిన జాగ్రత్తలు పాటిస్తున్నాను. కానీ, మీరు ఏమాత్రం బాధపడకండి.. మీ సమస్యలను తీర్చేందుకు దీనివల్ల నాకు మరింత సమయం దొరికింది. గుర్తుపెట్టుకోండి నేను ఎప్పటికీ మీకు అండగా ఉంటాను. మీకోసం ఉంటాను’ అని సోనూసూద్‌ ట్వీట్‌ చేశారు.

ఉపాధి వేటలో భాగంగా వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీలకు గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో సోనూసూద్‌ ఎన్నో సేవలు అందించారు. ప్రయాణ సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూలీల కోసం బస్సులు, రైళ్లను ఆయన ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా విదేశాల్లో చిక్కుకున్న కొంతమంది భారతీయ విద్యార్థులను సైతం స్వదేశానికి తీసుకువచ్చేందుకు విమానాలు ఏర్పాటు చేయించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇక, సినిమాల విషయానికి వస్తే గత కొన్నిరోజుల క్రితం ఆయన ‘ఆచార్య’ షూట్‌లో పాల్గొన్నారు. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో సోనూసూద్‌ ప్రతినాయకుడి పాత్రలో మెప్పించనున్నారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని