చిత్రీకరణను ఆస్వాదిస్తున్నా - vicky kaushal kiara advani bhumi pednekar resume shoot for mrlele
close
Published : 20/06/2021 10:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిత్రీకరణను ఆస్వాదిస్తున్నా

ముంబయి: ‘‘చాలా రోజుల తర్వాత చిత్రీకరణలో పాల్గొనడం ఆనందంగా, ఉత్సాహంగా ఉంది’’ అని చెబుతోంది అందాల భామ కియారా అడ్వానీ. మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూకు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ఇటీవలే ఆమె ‘మిస్టర్‌ లేలే’ షూటింగ్‌లో పాల్గొంది. విక్కీకౌశల్, భూమి ఫెడ్నేకర్‌ నటిస్తున్న ఈ చిత్రంలో కియారాది కీలక పాత్ర. ఎన్నో మార్పులు, చేర్పులు తర్వాత జనవరిలో దీని చిత్రీకరణ ప్రారంభించారు దర్శకుడు శశాంక్‌ ఖేతాన్‌. ఏప్రిల్‌లో విక్కీ, భూమిలకు పాజిటివ్‌ రావడంతో షూటింగ్‌ ఆపేశారు. ప్రస్తుతం దీన్ని ముంబయిలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఇందులో కియారా, విక్కీ, భూమి పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా కియారా మాట్లాడుతూ ‘‘చిత్రబృందానికి మొత్తం వ్యాక్సినేషన్‌ చేశారు. అందరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పని చేస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో పనిచేయడం సాహసమే అయినా... సంతోషంగా ఉంది. నేను చిత్రీకరణను పూర్తిగా ఆస్వాదిస్తున్నా.’’ అంటూ చెప్పుకొచ్చింది. కియారా ‘షేర్‌షా’ చిత్రంలోనూ నటిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని