ఈ షోలు గెలిస్తే.. కోటీశ్వరులే!
దేశమంతా ఎదురుచూసిన హిందీ బిగ్‌బాస్ రియాలిటీ షో ఫలితం తేలిపోయింది. రుబీనా దిలాయిక్ విజేతగా నిలిచింది. రూ.36 లక్షల ప్రైజ్‌మనీ, ఇంటిలో ఉన్నందుకు వారానికి రూ.5 లక్షల మొత్తం, ఇతర నజరానాలు అన్నీ కలిపి అమ్మడు రూ.కోటిన్నర వెనకేసుకున్నట్టు సమాచారం. ఇక ఫేమ్.. సినిమా అవకాశాల సంగతి చెప్పనే అక్కర్లేదు. ‘హమ్మో అంత డబ్బే..’ అని నోరెళ్లబెట్టకండి. దీన్ని మించిన ప్రైజ్‌మనీ ఇచ్చే షోలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.
షో: సర్వైవర్
బహుమతి మొత్తం: రూ.7.25కోట్లు
మొదలైంది: 2000
అచ్చమైన పోటీ ఉన్న రియాలిటీ షో ఇది. ఫ్రాన్స్‌కి చెందిన ‘బనిజయ్ గ్రూప్’ నిర్వహిస్తోంది. అటు ఇటుగా కొంచెం పేరు మార్చి చాలా దేశాల్లో ఈ షో నిర్వహిస్తున్నారు. దమ్ము, ధైర్యం ఉన్నవాళ్లే ఇందులో బరిలోకి దిగాలనేది తొలి నిబంధన. పోటీదారులను ద్వీపం, సముద్ర తీరం, అడవిలాంటి ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్తారు. వారిని కొన్ని గ్రూపులుగా విడగొట్టి ఒళ్లు గగుర్పొడిచే పోటీలు పెడతారు. సొంతంగా ఆహారం సంపాదించుకోడం.. ప్రమాదమైన ప్రాంతాల్లో నివాసం.. ఇలాంటి టాస్క్లెన్నో ఉంటాయి. రెండు నుంచి ఐదునెలల పాటు గడపాలి. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి ప్రైజ్‌మనీ పంచుతారు.
పోటీ: ది అమేజింగ్ రేస్
బహుమతి: రూ.7.25కోట్లు
మొదలైన ఏడాది: 2001
అడ్వెంచర్ రియాలిటీ షో. ఎలీస్ డోగనీరీ, బెర్ట్రామ్ వాన్ మున్స్టర్ రూపకర్తలు. 50 దేశాల్లో ఈ రియాలిటీ షోలు జరుగుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ప్రపంచమంతా చుట్టేసే సాహసయాత్ర. అత్యంత కఠినమైన రహదారుల గుండా వాహనాల్లో ప్రయాణించాలి. నిర్ణీత సమయంలో గమ్యం చేరాలి. సాధారణంగా డకార్ ర్యాలీని అత్యంత కఠినమైన రేస్‌గా చెబుతారు. రియాలిటీ షోల్లో దీన్ని క్లిష్టమైనదిగా భావిస్తారు.
షో: అమెరికాస్ గాట్ టాలెంట్
బహుమతి: రూ.7.25కోట్లు. లాస్‌వెగాస్‌లోని ప్లానెట్ హాలీవుడ్లో పదివారాలపాటు ఆతిథ్యం.
ప్రారంభం: 2006
మాతృక బ్రిటిష్ గాట్ టాలెంట్. రూపకర్త సైమన్ కోవెల్. నృత్యం, గాత్రం, హాస్యం, సాహసాలు, మ్యాజిక్.. ఇలా తమలోని ఎలాంటి ప్రతిభనైనా ప్రదర్శించుకోవడానికి మంచి వేదిక. ఎన్బీసీ టెలివిజన్ నెట్‌వర్క్‌లో ప్రసారం అవుతోంది. ఇప్పటికి 15 సిరీస్‌లు పూర్తయ్యాయి. దీనికి అనుకరణగా ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల్లో షోలు ప్రసారం అవుతున్నాయి.
షో: బిగ్ బ్రదర్
బహుమతి: రూ.3.75కోట్లు
ప్రారంభం: 2000
డచ్ టీవీలో మొదటిసారి ప్రారంభించారు. భారతీయ భాషలన్నింటిలో ప్రసారమయ్యే మన బిగ్‌బాస్ షోకి మూలం ఇదే. పోటీదారులు అందరినీ ఒక ఇంటిలో పెట్టి, రకరకాల టాస్కులు పెట్టడం.. నెగ్గినవారు ముందుకెళ్లడం.. ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా కొందరు బయటికి రావడం.. చివర్లో ఒకరు విజేతగా నిలవడం.. ఈ వరుస క్రమం అంతా మనకు తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి ఇందులో కనిపించిన తర్వాతే బాగా పాపులరైంది.
షో: ది వాయిస్
ప్రైజ్‌మనీ: రూ.75లక్షలు
ప్రారంభం: 2011
అమెరికా సింగింగ్ రియాలిటీ షో. ఇప్పటికి 18 సీజన్లు పూర్తయ్యాయి. ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చి పాప్ సింగర్లుగా మారినవారున్నారు. జేవియర్ కోలన్, జోర్డాన్ స్మిత్, కోల్ కొహాన్స్కీ.. ఇలా ఎందరో. క్రిస్టినా అగ్యులెరా, కెల్లీ క్కార్క్సన్, మిలీ సైరస్, నిక్ జోనాస్, అలీషియా కీస్.. లాంటి స్టార్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. భారతీయ భాషల్లో నిర్వహిస్తున్న అన్ని పాటల రియాలిటీ షోలు దీన్నుంచి స్ఫూర్తి పొంది మొదలైనవే.
రియాలిటీ షో: డాన్సింగ్ విత్ ది స్టార్స్
బహుమానం: ఇద్దరికి రూ.37లక్షలు, మిర్రర్ బాల్ గోల్డ్ ట్రోఫీ
ప్రారంభం: 2005
అమెరికన్ డాన్స్ రియాలిటీ షో సిరీస్. బ్రిటన్‌కి చెందిన ‘స్ట్రిక్ట్లీ కమ్ డాన్సింగ్’ మాతృక. ఇందులో పోటీదారులతో ఎవరైనా ఒక ప్రముఖ సెలెబ్రెటీ లేదా ప్రొఫెషనల్ డ్యాన్సర్‌తో జోడీ కడతాడు. పదిహేను వారాలపాటు నిర్వహిస్తారు. చివరిగా పోటీల్లో ఒక విజేత, రన్నరప్‌ని ఎంపిక చేస్తారు. టైరా బ్యాంక్స్, బ్రూక్ లిసా, సమంతా హ్యారిస్లాంటి టాప్ యాంకర్లు ఈ పోటీని నిర్వహిస్తున్నారు.
షో: టాప్ చెఫ్
ప్రైజ్‌మనీ: రూ.90లక్షలు
ప్రారంభం: 2006
గరిటె తిప్పడంలో ఎవరి సత్తా ఎంతో తేల్చేసే రియాలిటీ షో ఇది. న్యాయ నిర్ణేతలంతా ఫుడ్, హోటల్ పరిశ్రమలో కాకలు తీరిన చెఫ్లేనని ఇక వేరే చెప్పాలా? ప్రతివారం ఒక్కరు ఎలిమినేట్ అవుతూ చివరికి ఒక్కరు విజేతగా నిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. ఇప్పటికి 12 సీజన్లు పూర్తయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రేక్షకులున్న రియాలిటీ షోలో ఇదొకటి. గెలిచినవారికి ‘టాప్ చెఫ్ ఆల్ స్టార్స్’ అనే బిరుదు కూడా ఇస్తారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
- రూ. 6.5 కోట్ల సెట్లో.. ‘శ్యామ్ సింగరాయ్’
-
స్వీటీ వెంటపడుతున్న గెటప్ శ్రీను
-
ధర్మం తప్పినప్పుడే యుద్ధం!
-
‘ఇష్క్’ సినిమా విడుదల వాయిదా
గుసగుసలు
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- మహేష్ - రాజమౌళిల సినిమా అప్పుడేనా?
- జూన్‌కి వాయిదా పడిన ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్!
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
రివ్యూ
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
కొత్త పాట గురూ
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..
-
Ek Mini Katha: స్వామి రంగా చూశారా!
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?