జూన్‌ 25న డబుల్‌ ధమాకా - lkg and jiivi premieres june 25
close
Published : 19/06/2021 23:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జూన్‌ 25న డబుల్‌ ధమాకా

ఇంటర్నెట్‌ డెస్క్‌: రానున్న శుక్రవారం సినిమా ప్రియులకు పసందైన విందు ఇవ్వబోతోంది. ఎందుకంటే ఆ ఒక్కరోజే రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో ఈ నెల 25న ఈ రెండు చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. ‘ఎల్‌.కె.జి’, ‘జీవి’ ఈ రెండు చిత్రాలు ఓటీటీ వేదికగా డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాయి. చిన్న పట్టణంలో.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న కౌన్సిలర్‌ కథ ఆధారంగా ‘ఎల్‌.కె.జి’ని తెరకెక్కించారు. ‘అమ్మోరు తల్లి’ సినిమాతో అలరించిన ఆర్‌.జె.బాలాజీ కీలకపాత్ర పోషించారు. మరో వైపు.. బంగారం చోరీ చేసి జీవితంలో సెటిల్‌ అయిపోవాలనే ఒక తెలివైన యువకుడి కథ ఆధారంగా తెరకెక్కించిన ‘జీవి’ సైతం విడుదల కానుంది. వి.జె.గోపీనాథ్‌ దర్శకత్వం వహించారు. వెట్రి, మోనిక చిన్నకొట్ల కీలకపాత్రలు పోషించారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని