Thalaivii: కన్నె కలలా నందలాల.. పలవరించెను రాధికా..! - nandhalala video song from thalaivii
close
Published : 04/09/2021 20:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Thalaivii: కన్నె కలలా నందలాల.. పలవరించెను రాధికా..!

హైదరాబాద్‌: ‘ప్రియసఖా.. నాయకా.. పలవరించెను రాధికా.. వేడుక.. చాలిక కలుగజేయర కలయిక’ అంటూ ఆరాధన భావంతో పాట అందుకున్నారు జయలలిత. ఆ పాటకు అంతటి ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ మంత్రముగ్ధులయ్యారు. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? ‘తలైవి’ సినిమాలోనండీ. దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఎంజీఆర్‌గా అరవిందస్వామి అలరించనున్నారు. వినాయకచవితి సందర్భంగా సెప్టెంబరు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇందులోని ‘నందలాల’ అంటూ సాగే గీతాన్ని గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి అభిమానులతో పంచుకున్నారు. ఆద్యంతం అలరించేలా సాగే ఈ పాటకు జీవీ ప్రకాశ్‌కుమార్‌ స్వరాలు సమకూర్చారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని