close
Published : 27/02/2021 12:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘బతుకే బస్టాండ్‌..’ అంటూ నితిన్‌ చిందులు!        


హైదరాబాద్‌: పెళ్లయ్యాక తన బతకు బస్టాండ్‌  అయ్యిందంటున్నారు హీరో నితిన్‌. అదేంటి మొన్ననేగా నితిన్‌కు పెళ్లయింది. అప్పుడే ఇలా అంటున్నాడేంటి అనుకుంటున్నారా. ఆయన చెప్పేది రియల్‌లైఫ్‌ గురించి కాదు రీల్‌ లైఫ్‌లో. నితిన్‌, కీర్తిసురేష్‌ హీరోహీరోయిన్లగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్‌దే’చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ చిత్రంలోని ‘బతుకే బస్టాండే..’అంటూ సాగుతున్న లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. పెళ్లి తర్వాత తన బతకు ఎలా అయ్యిందో వివరిస్తూ ఈ సాంగ్‌లో నితిన్ బాధలను సరదాగా ఏకరవు పెడుతున్నారు. దేవీశ్రీప్రసాద్‌ స్వరపరిచిన ఈ పాటను సాగర్‌ ఆలపించగా శ్రీమణి లిరిక్స్‌ అందించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 26న థియేటర్లలోకి రానుంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని