అలరిస్తోన్న ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ టీజర్‌ - reddygarintlo rowdyism teaser out starring raman vinod kumar
close
Published : 24/06/2021 16:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలరిస్తోన్న ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ టీజర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘రామ్‌ చరణ్‌, బన్నీ, అభిషేక్‌ బచ్చన్‌, కోహ్లి, నాగార్జున, మహేశ్‌ బాబు, సానియా మీర్జా.. ఇలాంటి వాళ్లు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆదర్శమంటారు. అదే పేదవాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే పరువు, ప్రతిష్ట అంటూ చంపేస్తారా?’ అని అంటున్నాడు యువ నటుడు రమణ్‌. ఈయన కథానాయకుడిగా ఎం.రమేశ్‌, గోపి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ ఇటీవల ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. రొమాంటిక్‌, యాక్షన్‌ సన్నివేశాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంది. ప్రేమ పెళ్లి గురించి కథానాయకుడు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. మరి ఈ రౌడీయిజం కథేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ చిత్రంలో వర్ష విశ్వనాథ్‌, పావని, ప్రియాంక, అంకిత,లావణ్య, వినోద్‌ కుమార్‌,రచ్చ రవి తదితరులు నటిస్తున్నారు. కె.రమణ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ చిత్రానికి చక్రి సోదరుడు మహిత్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని