‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో సీత పాత్ర నిడివి పెరగనుందా? - rrr: is alia bhatt’s role in the film being extended
close
Published : 19/03/2021 23:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో సీత పాత్ర నిడివి పెరగనుందా?

ఇంటర్నెట్‌ డెస్క్: అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌.ఆర్‌.ఆర్‌). ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులు. ఇందులో చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఆయనకు జోడీగా అలియా భట్‌ సీత పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన  ఫస్ట్ లుక్‌ పోస్టర్‌కు విశేష స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో అలియా పాత్ర నిడివిని కాస్త పెంచే యోచనలో చిత్రబృందం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అలియాకి సంబంధించిన టాకీ పార్ట్ పూర్తయిందట. ఇక రామ్‌చరణ్‌ - అలియాలపై ఓ పాట  చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ నెల చివరిలో అలియా హైదరాబాద్‌కు రానుంది. అప్పుడే ఆమెకు సంబంధించిన మరికొన్ని సీన్లు కూడా తీస్తారని టాక్‌.

మొత్తం మీద సీత ఫస్ట్‌ లుక్‌కి లభించిన స్పందనతోనే అలియా పాత్రకి మరింత ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 13న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని