Sumanth: మళ్ళీమొదలైంది.. ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది..! - telugu news first single from malli modalaindi released now
close
Published : 21/08/2021 16:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sumanth: మళ్ళీమొదలైంది.. ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది..!

హైదరాబాద్‌: సుమంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న విభిన్న కుటుంబ కథా చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. పెళ్లి, విడాకులు తర్వాత జీవితం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌ని ఈ సినిమాలో చూపించనున్నారు. నైనా గంగూలీ కథానాయిక. కీర్తి కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘మళ్ళీ మొదలైంది’ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ను శనివారం నటుడు నితిన్‌ విడుదల చేశారు. ‘ఎంటో ఏమో జీవితం’ అంటూ సాగే పాట అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. రెడ్‌ సినిమాస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాజశేఖర్‌ నిర్మాత. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు అందిస్తున్నారు. సుహాసిని, పోసాని కృష్ణమురళీ, మంజుల ఘట్టమనేని కీలకపాత్రలు పోషిస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని