IPL 2021 - Delhi Capitals: పంత్‌ విషయంలో జట్టు నిర్ణయాన్ని గౌరవిస్తా: శ్రేయస్ - telugu news ipl 2021 shreyas iyer says he respects the delhi capitals decision on rishabh pants captaincy
close
Published : 24/09/2021 10:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL 2021 - Delhi Capitals: పంత్‌ విషయంలో జట్టు నిర్ణయాన్ని గౌరవిస్తా: శ్రేయస్

దుబాయ్‌: శ్రేయస్‌ అయ్యర్‌ గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చినా దిల్లీ క్యాపిటల్స్‌.. రిషబ్‌ పంత్‌ను కెప్టెన్‌గా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై శ్రేయస్‌ స్పందించాడు. ఫ్రాంఛైజీ నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పాడు. ‘‘కెప్టెన్సీ అందుకున్నప్పుడు నేను భిన్నమైన మానసిక స్థితిలో ఉన్నా. నా నిర్ణయాలు బాగున్నాయి. కెప్టెన్సీ వల్ల గత రెండేళ్లలో నాకు చాలా ప్రయోజనం కలిగింది. ఎవరు కెప్టెన్‌గా ఉండాలన్నది నిర్ణయించాల్సింది ఫ్రాంఛైజీనే. వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తా. సీజన్‌ ఆరంభం నుంచి రిషభ్‌ జట్టును సమర్థంగా నడిపిస్తున్నాడు. అది సీజన్‌ ఆఖరి వరకు కొనసాగాలని మేనేజ్‌మెంట్‌ భావించి ఉంటుంది. వాళ్ల నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తా’’ అని చెప్పాడు. కెప్టెన్‌గా దిల్లీని 2020 టోర్నీలో ఫైనల్‌కు తీసుకెళ్లిన 26 ఏళ్ల శ్రేయస్‌.. 2021 ఐపీఎల్‌ తొలి అంచెకు గాయంతో దూరమైన సంగతి తెలిసిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని