ఇంటర్నెట్ డెస్క్: దళపతి విజయ్ 66వ చిత్రం గురించి కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. విజయ్ తదుపరి చిత్రాన్ని తెరకెక్కించేది ఇతడే అంటూ ఇద్దరు దర్శకుల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. వాళ్లలో ఒకరు అట్లీ కాగా.. మరొకరు లోకేశ్ కనకరాజ్. సామాజిక మాధ్యమాల్లోనూ వీరిద్దరి పేర్లే ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ చర్చల దశలో ఉన్నారని, తన 66 సినిమాకు ఎవర్ని దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారో త్వరలోనే తెలియనుందని అక్కడి మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఇద్దరు దర్శకులు గతంలో విజయ్‌తో పనిచేసిన వారే. ఇటీవలే విడుదలైన ‘మాస్టర్’ చిత్రానికి లోకేశ్ కనకరాజే దర్శకుడు. విజయ్- అట్లీ కాంబినేషన్లో ఇప్పటికే మూడు చిత్రాలు వచ్చాయి. మరోసారి విజయ్ ఈ దర్శకుడికే అవకాశం ఇస్తారంటూ ట్వీట్ చేస్తున్నారు విజయ్ అభిమానులు. మరి విజయ్ తన సినిమాకు సారథిగా ఎవరిని తీసుకుంటారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా ఆగాల్సిందే.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘సొగసు చూడ తరమా’ ఫస్ట్‌లుక్
- ‘జాతి రత్నాలు’ గుర్తుండిపోయే సినిమా: విజయ్
-
నా జీవితంలో ఇది ఒక ఆణిముత్యం
- మంచి సందేశం ఇచ్చే చిత్రమే ‘శ్రీకారం’: చిరంజీవి
-
34 ఏళ్లకు.. అనుపమ్ టాలీవుడ్ ఎంట్రీ
రివ్యూ
ఇంటర్వ్యూ
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
- నేను నటిస్తుంటే కాజల్ భయపడేది: నవీన్‌చంద్ర
-
అతనొక అమాయక ‘జాతిరత్నం’: నాగ్ అశ్విన్
-
‘శ్రీకారం’ వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం: నరేష్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
కొత్త పాట గురూ
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
‘అరణ్య’ నుంచి అడవి గీతం
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!