close

తాజావార్తలు

పోలీస్‌ కెప్టెన్‌గా హాలీవుడ్‌ నటుడు

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్రకథానాయిక అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘నిశ్శబ్దం’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా గురువారం చిత్రబృందం ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన హాలీవుడ్‌ నటుడు మైఖేల్‌ మ్యాడ్సన్‌ లుక్‌ను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆయన రిచర్డ్‌ డికెన్స్‌ అనే పోలీస్‌ కెప్టెన్‌ పాత్రలో కనిపించనున్నారు. ‘‘నిశ్శబ్దం’ చిత్రంలో సియాటెల్‌ పోలీస్‌ కెప్టెన్‌ రిచర్డ్‌ డికెన్స్‌గా హాలీవుడ్‌ నటుడు, కిల్‌బిల్‌ ఫేం మైఖేల్‌ మ్యాడ్సన్‌’ అని చిత్రబృందం ట్వీట్‌ చేసింది.

హేమంత్‌ మధుకర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుష్క సాక్షి అనే మూగ అమ్మాయి పాత్రలో నటిస్తున్నారు. మాధవన్‌, షాలినీ పాండే, అంజలి, సుబ్బరాజు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన వెంకట్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘భాగమతి’ హిట్‌ తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రమిది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.