
తాజా వార్తలు
కారులోనే జల సమాధి
చెరువులోకి దూసుకెళ్లిన కారు: ముగ్గురి మృతి
రాజమహేంద్రవరం: కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే... యానాంకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రసాదరావు, అతని భార్య విశ్రాంత అధ్యాపకురాలు విజయలక్ష్మి .. కుమారుడు సంతోష్ చంద్ర ప్రణీత్ నిశ్చితార్థం ముగించుకొని గురువారం రాత్రి ఏటిగట్టు రహదారిపై యానాం బయలు దేరారు. ఈ క్రమంలో కె.గంగవరం మండలం కోటిపల్లి కోట గ్రామం వద్దకు రాగానే కారు అదుపు తప్పి గోదావరి ఏటి గట్టు రహదారి పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో ఎవరూ గుర్తించలేకపోయారు. చెరువులోతు పెద్దగా లేకపోయినా.. కారు డోర్లు తెరుచుకోకపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. శుభకార్యం ముగించుకొని ఇంటికి తిరిగొస్తూ.. తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో బంధువులు బోరున విలపిస్తున్నారు. సంతోష్ చంద్ర ప్రణీత్ బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- కల లాంటిది.. నిజమైనది
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- యువతిని హత్యచేసిన డిల్లీబాబు ఆత్మహత్య
- భలే పంత్ రోజు..
- ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
