Crime news: కన్న కూతురుని హతమార్చిన తండ్రి

తాజా వార్తలు

Published : 02/07/2021 17:11 IST

Crime news: కన్న కూతురుని హతమార్చిన తండ్రి

తమిళనాడు: కూతురి ప్రేమ వివాహం ఓ తండ్రిని కసాయిగా మార్చింది. తమిళనాడులోని తెనకాశి జిల్లాకు చెందిన మరిముత్తు అనే వ్యక్తి కన్న కూతురునే కర్కశంగా హత్య చేశాడు. అళంగులం పట్టణానికి చెందిన షాలోమ్ షీబా అనే యువతి ముత్తురాజ్ అనే యువకుడిని ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి కుటుంబానికి దూరంగా అళంగులం పట్టణం పక్కనే ఉన్న కల్వకుర్చీలో భర్తతో కలిసి జీవిస్తోంది. అయితే తల్లిదండ్రులను చూసేందుకు కొన్ని నెలల తర్వాత షీబా పుట్టింటికి వెళ్లగా ఆమె తండ్రి మరిముత్తు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఇష్టంలేని పెళ్లి చేసుకుందనే కోపంతో ఇంటికి వచ్చిన కూతురిని విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన యువతిని స్థానికులు ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని