సవతి అన్నను హత్యచేసిన యువకుడు
close

తాజా వార్తలు

Updated : 12/05/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సవతి అన్నను హత్యచేసిన యువకుడు

భోపాల్‌: వాష్‌రూం శుభ్రం చేయమని అడిగినందుకు 25 ఏళ్ల యువకుడు తన సవతి అన్నను హత్యచేసిన ఘటన భోపాల్‌లోని చోలా ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఫేజ్‌-4 భన్‌పూర్‌ మల్టీలో నివసిస్తున్న నానక్‌ రామ్‌ (32)  ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో తాగి ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఒక్కడే ఉన్న తన తమ్ముడు అనిల్‌ (25)ను వాష్‌రూమ్‌ శుభ్రం చేయమని ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలో జరిగిన గొడవలో అనిల్‌  కత్తితో తన అన్నను పొడిచి హత్య చేశాడు. మొదటి అంతస్తు నుంచి శవాన్ని ఇంటివెనుక పారవేసి ఏమీ తెలియనట్టు టెర్రస్‌ మీదకి వెళ్లి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసలు రంగంలోకి దిగి సంఘటనా స్థలిని పరిశీలించారు. మృతుడు నానక్‌ రామ్‌గా గుర్తించారు. అపార్ట్‌మెంట్‌లోని రక్తపు మరకలను గుర్తించి, ఆ రాత్రి ఇంట్లో ఉన్న అనిల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు నేరం ఒప్పుకున్నాడు.

నానక్‌రాం తల్లి లక్ష్మి మొదటి భర్తతో విడిపోయి రెండో పెళ్లి చేసుకోగా అనిల్‌, నలుగురు కుమార్తెలు జన్మించారు. అనిల్‌ రోజువారీ కూలీగా పనిచేస్తూ తల్లికి సాయపడేవాడు. నానక్‌ రాం పెయింటింగ్‌ కాంట్రాక్టర్‌గా పనిచేసేవాడు. కుటుంబం అంతా కలిసే ఉంటున్నారని, గతంలో కూడా అన్నదమ్మలు చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతుండేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని