షర్జీల్‌ ఇమామ్‌పై దేశద్రోహం కేసు

తాజా వార్తలు

Published : 18/04/2020 17:41 IST

షర్జీల్‌ ఇమామ్‌పై దేశద్రోహం కేసు

దిల్లీ: షర్జీల్‌ ఇమామ్‌పై దిల్లీ పోలీసులు శుక్రవారం ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేశామని తెలిపారు. దిల్లీలో అల్లర్లకు కారకుడైన ఇమామ్‌ను డిసెంబర్‌ 13న పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఇమామ్‌ రెచ్చగొట్టే ప్రసంగం చేసిన రెండు రోజుల తర్వాత జామియా విద్యార్థులు పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలో ర్యాలీ తీశారు. అప్పుడు పోలీసులపై దాడి చేశారు. అల్లర్లకు పాల్పడ్డవారిపై తొలి ఛార్జిషీట్‌లో ఐపీసీ సెక్షన్‌ 124ఏ, 153ఏ ప్రకారం కేసులు పెట్టామని ఓ సీనియర్‌  పోలీసు అధికారి తెలిపారు. అనుబంధ ఛార్జిషీట్‌ను సాకేత్‌ కోర్టులో నేడు దాఖలు చేశామని వెల్లడించారు.

షాహీన్‌బాగ్‌ నిరసనల సమయంలో షర్జీల్‌ ఇమామ్‌ తెరపైకి వచ్చాడు. అప్పుడు బిహార్‌లోని జెహనాబాద్‌లో జనవరి 28న అరెస్టయ్యాడు. జేఎన్‌యూలో ఇతను పీహెచ్‌డీ విద్యార్థి. భారత్‌ నుంచి అసోం, ఈశాన్య రాష్ట్రాలను విడదీయాలంటూ జాతి వ్యతిరేఖంగా ప్రసంగించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని