పెద్దఅంబర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం

తాజా వార్తలు

Updated : 18/09/2021 06:11 IST

పెద్దఅంబర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం

మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. గోదాం నుంచి వెలువడుతున్న దట్టమైన పొగలు

పెద్దఅంబర్‌పేట్‌, న్యూస్‌టుడే: నగర శివారు ప్రాంతమైన పెద్దఅంబర్‌పేట్‌లో క్రిమి సంహారక రసాయనాల గోదాంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలోని ప్రశాంత్‌ గోదాంను నాలుగు నెలల క్రితమే స్వాల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సంస్థ అద్దెకు తీసుకుంది. అందులో క్రిమిసంహారక మందుల్ని నిల్వ చేశారు. శుక్రవారం ఉదయం సుమారు 8.45 గంటల సమయంలో గోదాంలో అగ్గిరాజుకుని మంటలు ఎగిసిపడ్డాయి. భారీ ఎత్తున పురుగుల మందు నిల్వలు ప్లాస్టిక్‌ డబ్బాలు, సంచులు, అట్టపెట్టల్లో ఉండడంతో ఓ పక్క మంటలు ఆర్పుతుండగా మరోపక్క అగ్గి రాజుకుని దట్టమైన పొగలు ఎగిసిపడ్డాయి. దాంతో అగ్నిమాపక సిబ్బంది, రామోజీ ఫిలింసిటీకి చెందిన ఫైరింజన్‌ సిబ్బంది దాదాపు ఐదు గంటల పాటు నిర్విరామంగా శ్రమించి సాయంత్రానికి కల్లా అదుపులోకి తెచ్చారు. ఒకదశలో మంటలను అదుపులోకి తెచ్చేందుకు జేసీబీల సాయంతో గోదాం గోడలను కూలగొట్టారు. దట్టమైన పొగలు, భరించలేని విష వాయువులతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా సమీప కాలనీవాసులను కొన్ని గంటల పాటు ఇళ్లలో ఉండరాదంటూ అధికారులు హెచ్చరించారు. మంటలు ఆర్పుతుండగా బయటకు వచ్చే నీరు విషతుల్యం కావడంతో అది డ్రైనేజీల్లో కలకుండా పెద్దఅంబర్‌పేట్‌ పురపాలిక కమిషనర్‌ ఖమర్‌ అహ్మద్‌ గుంతలు తీయించి ఆ నీటిని అందులోకి మళ్లించారు. రూ. 18 కోట్లమేర ఆస్తినష్టం సంభవించినట్లుగా అంచనా.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని