Crime News: సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో దారుణం.. యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

తాజా వార్తలు

Updated : 10/09/2021 07:08 IST

Crime News: సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో దారుణం.. యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

నేరేడుచర్ల, న్యూస్‌టుడే: ప్రేమోన్మాదంతో విచక్షణ కోల్పోయిన యువకుడు ఒకరు బ్లేడుతో ఓ యువతి గొంతు కోశాడు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఈ దారుణం చోటుచేసుకుంది. తీవ్ర రక్తస్రావమైన యువతిని ఆసుపత్రికి తరలించారు. నేరేడుచర్ల ఎస్సై విజయ్‌ప్రకాశ్‌ కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా అచ్చంపేట ప్రాంతానికి చెందిన ఓ యువతి (18) తల్లిదండ్రులు ఏడాది నుంచి నేరేడుచర్లలో ఉంటున్నారు. తండ్రి ఆయుర్వేద మందులు అమ్ముతుంటారు. పదో తరగతి వరకు చదివిన ఆమె గుంటూరు జిల్లాలో బంధువుల వద్ద ఉంటూ అప్పుడప్పుడు తల్లిదండ్రుల వద్దకు వచ్చి వెళ్తుండేది. పదిరోజుల క్రితం మరోసారి రాగా.. అప్పటి నుంచి స్థానిక యువకుడు బత్తుల బాల సైదులు (23) ప్రేమ పేరుతో ఆమె వెంటపడుతున్నాడు. తనకు పెళ్లి నిశ్చయమైందని చెప్పినా వేధింపులు ఆగలేదు. ఆ యువతిని మేనమామ కుమారుడికిచ్చి పెళ్లి చేసే ఉద్దేశంతో బంధువులు బుధవారమే ఇక్కడకు వచ్చి వెళ్లారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో బాధితురాలు మరో బాలికతో కలిసి సమీపంలోని కాల్వ వద్దకు దుస్తులు ఉతకడానికని వెళ్లింది. సైదులు వీరి వద్దకు వచ్చి ఆమెను కింద పడవేసి బ్లేడుతో గొంతు కోశాడు. స్థానికులు స్పందించి 108లో ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిందితుడు ఆకతాయిగా తిరుగుతుంటాడని హుజూర్‌నగర్‌ పోలీసులు తెలిపారు. బాధితురాలికి చికిత్స అందుతోందని, ఆమె కోలుకుంటోందని చెప్పారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని