సజ్జనార్‌ను కలిసిన హేమంత్‌ కుటుంబ సభ్యులు 

తాజా వార్తలు

Updated : 30/09/2020 17:22 IST

సజ్జనార్‌ను కలిసిన హేమంత్‌ కుటుంబ సభ్యులు 

హైదరాబాద్‌: హేమంత్‌ హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ అతని కుటుంబ సభ్యులు బుధవారం సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. హేమంత్‌ కుటుంబ సభ్యులతో పాటు తనకు కూడా ప్రాణహాని ఉందని హేమంత్‌ భార్య అవంతి సీపీ సజ్జనార్‌కు వివరించారు. హేమంత్‌ హత్య తరువాత జరిగిన పరిణామాలను సీపీకి వెల్లడించారు.

ప్రేమ వివాహం చేసుకుని ఇటీవల హత్యకు గురైన హేమంత్‌ కేసు విచారణకు సంబంధించి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాలని సీపీ వీసీ సజ్జనార్‌ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈకేసులో ఎవరినీ వదిలి పెట్టబోమని, నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చూస్తామని సజ్జనార్‌ బాధితులకు హామీ ఇచ్చినట్టు సమాచారం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని