శంషాబాద్‌లో లారీ బోల్తా: ఆరుగురి మృతి

తాజా వార్తలు

Published : 19/04/2021 01:21 IST

శంషాబాద్‌లో లారీ బోల్తా: ఆరుగురి మృతి

శంషాబాద్‌: హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. సుల్తాన్‌పల్లి ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీలు.. కూరగాయలు, ఇతర నిత్యావసరాలు కొనేందుకు శంషాబాద్‌ మార్కెట్‌కు లారీలో వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో కళాకుమార్ సునా (20), కృపా సునా (25), గోపాల్‌ దీప్‌ (25), బుదన్‌ (25), హస్తా యాదవ్‌ (55)తో పాటు మరొకరు ఉన్నారు.

ఘటన జరిగిన సమయంలో లారీలో సుమారు 50మంది కూలీలు ఉన్నారు. వీరందర్నీ ఒడిశాలోని బలంగిర్‌ జిల్లా డాబుగా బ్లాక్ చికిలి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. రోడ్డుకు అడ్డంగా లారీ బోల్తాపడటంతో చాలాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అనంతరం జేసీబీ సాయంతో లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని