AP News: తెదేపా కార్యాలయంలో దాడి కేసులో మరో ఆరుగురి అరెస్టు

తాజా వార్తలు

Published : 24/10/2021 17:28 IST

AP News: తెదేపా కార్యాలయంలో దాడి కేసులో మరో ఆరుగురి అరెస్టు

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మీడియాలో ప్రసారమైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నారు. వీరిలో నలుగురు విజయవాడ వాసులు కాగా,  ఇద్దరు గుంటూరుకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ఈ కేసులో గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన 10 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా విజయవాడకు చెందిన జోగరాజు, షేక్‌ బాబు, షేక్‌ సైదా, సూర్య సురేష్‌, గుంటూరుకు చెందిన మోహన్‌ కృష్ణారెడ్డి, గురవయ్యలను అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు గుంటూరు అర్బన్‌ ఎస్పీ కార్యాలయం వెల్లడించింది. మీడియాలో వచ్చిన దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుల గర్తింపు ప్రక్రియను చేపట్టారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని