Nalgonda crime: భక్తులను మోసం చేసిన విశ్వచైతన్య స్వామి అరెస్టు

తాజా వార్తలు

Updated : 03/08/2021 18:41 IST

Nalgonda crime: భక్తులను మోసం చేసిన విశ్వచైతన్య స్వామి అరెస్టు

నల్గొండ: విశ్వ చైతన్య స్వామితో పాటు మరో ముగ్గురు శిష్యులను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. భక్తి ముసుగులో మోసం చేశారని ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం అజ్మాపూర్‌లో శ్రీసాయి సర్వస్వం మాన్సీ ఛారిటబుల్‌ ట్రస్టును ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టు పేరిట మోసాలకు పాల్పడుతున్నారని.. భక్తి పేరుతో మహిళలను లోబర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ భక్తురాలి ఫిర్యాదుతో విశ్వచైతన్య స్వామి లీలలు వెలుగులోకి వచ్చాయి. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆశ్రమంపై దాడి చేసి విశ్వ చైతన్య స్వామితో పాటు మరో ముగ్గురు శిష్యులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.26 లక్షలు, 500 గ్రాముల బంగారం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ బాండ్లు, 17 ఎకరాల భూమి పత్రాలు, 7 ల్యాప్‌టాప్‌లు, 4 సెల్‌ఫోన్లు, కారు, మూలికలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడించారు. విశ్వ చైతన్య స్వామికి 40 దేశాల్లో భక్తులు ఉన్నారని ఎస్పీ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని