Crime News: రోడ్డున పడేసిన వివాహేతర బంధం.. కుమార్తెకు విషమిచ్చి..

తాజా వార్తలు

Published : 26/08/2021 15:40 IST

Crime News: రోడ్డున పడేసిన వివాహేతర బంధం.. కుమార్తెకు విషమిచ్చి..

నిర్మల్‌: వివాహేతర సంబంధం ఓ మహిళను రోడ్డున పడేసింది. పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. తన గారాలపట్టికి విషమిచ్చి చేతులారా చంపుకొనేలా పురిగొల్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్‌ జిల్లా సారంగపూర్‌ మండలానికి చెందిన బాధితురాలికి ముగ్గురు పిల్లలున్నారు. కొన్నిరోజులుగా శ్రీకాంత్‌రెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఆదివారం శ్రీకాంత్‌రెడ్డి బెదిరింపులతో చిన్న కుమార్తెను తీసుకుని అతడితో వెళ్లిపోయింది. మూడు రోజుల్లోనే అతడు మోసం చేసి రోడ్డుపై వదిలేశాడని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. ఏం చేయాలో పాలుపోక ఓ లాడ్జి బయట కుమార్తెకు పురుగుల మందు తాగించి తానూ తాగేసింది. దీంతో కుమార్తె మృతిచెందగా.. సదరు మహిళ నిర్మల్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని