Hyd: ఫతేనగర్‌లో సెక్యూరిటీ గార్డు దారుణహత్య

తాజా వార్తలు

Updated : 16/07/2021 11:21 IST

Hyd: ఫతేనగర్‌లో సెక్యూరిటీ గార్డు దారుణహత్య

సనత్‌నగర్: ఓ సెక్యూరిటీ గార్డును గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్‌ సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ముత్తు యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫతేనగర్‌లోని ఎల్బీఎస్ నగర్‌కు చెందిన వేముల వెంకటేశ్‌(47) గత నాలుగు సంవత్సరాల నుంచి ఓ ఖాళీ స్థలానికి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి విధుల్లోకి వచ్చిన వెంకటేశ్‌.. తన గదిలోనే హత్యకు గురై ఉండటాన్ని ఈ ఉదయం సుధాకర్ అనే ఓ ఆటో డ్రైవర్ గమనించారు. గుర్తు తెలియని వ్యక్తులు తలపై బండరాళ్లతో మోది హత్య చేసినట్లుగా తెలుస్తోంది.

ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు. దుండగుల వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై చెప్పారు. ఘటనాస్థలంలో వేలిముద్రల నిపుణులు, డాగ్ స్క్వాడ్ వచ్చి ఆధారాలు సేకరించారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని