యువతిపై కత్తితో దాడి.. ఆపై..
close

ప్రధానాంశాలు

Updated : 09/05/2021 06:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యువతిపై కత్తితో దాడి.. ఆపై..

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

జగిత్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేసి గాయపరిచి తానూ అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. జాబితాపూర్‌ గ్రామానికి చెందిన ఓ యువతి(24)ని మేడిపల్లి మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన కట్కం రాజ్‌కుమార్‌(25) కొద్దికాలంగా ప్రేమిస్తున్నాంటూ వెంటపడుతున్నాడు. గల్ఫ్‌కు వెళ్లి 4 నెలల క్రితమే వచ్చిన రాజ్‌కుమార్‌ తరచూ యువతికి ఫోన్‌ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె స్పందించకపోవటంతో శనివారం ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు. ప్రతిఘటించడంతో రాజ్‌కుమార్‌ తన దగ్గరున్న కత్తితో యువతి మెడ వెనుక వైపు కోశాడు. అప్పటికే ఆమె కుటుంబ సభ్యులు చేరుకుని అడ్డుకోవటంతో అతను అదే కత్తితో గొంతుకోసుకున్నాడు. తీవ్రగాయాలైన రాజ్‌కుమార్‌ను 108 వాహనంలో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌కు తీసుకెళ్లగా అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. యువతిని జగిత్యాలలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్సై చిరంజీవి తెలిపారు. అతను ఎవరో తమకు తెలియదని యువతి తండ్రి తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన