close

ప్రధానాంశాలు

Published : 12/04/2021 03:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వృద్ధ దంపతుల ఆత్మహత్య

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: అనారోగ్యం, కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన వృద్ధ దంపతులు విష ద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌ సీఐ బీవీ శివప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ఐరాల మండలం యాదగిరివారిపల్లికి చెందిన తుమాటి చిన్నబ్బనాయుడు(73), రుక్మిణమ్మ(60) దంపతుల ఇద్దరు కుమార్తెలకు వివాహం జరగడంతో బెంగళూరులో స్థిరపడ్డారు. పిల్లలిద్దరూ అక్కడ ఉండటంతో ఆస్తులు అమ్ముకుని దంపతులు బెంగళూరుకు వెళ్లారు. ఇటీవల కుటుంబంలో మనస్పర్థలు ఏర్పడ్డాయి. చిన్నబ్బనాయుడు నరాల జబ్బుతో పాటు మూర్ఛతో బాధపడేవారు. స్విమ్స్‌ ఆస్పత్రిలో వైద్యం కోసం ఈ నెల 7వ తేదీన తిరుపతికి వచ్చారు. రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న లాడ్జిలో దిగారు. శనివారం ఆసుపత్రికి వెళ్లి లాడ్జికి తిరిగి వచ్చిన దంపతులు విష ద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ఉదయం లాడ్జి యాజమాన్యం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన