close

ప్రధానాంశాలు

Updated : 19/04/2021 06:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భూమి రిజిస్ట్రేషన్‌కు వెళ్తూ ఇద్దరి అదృశ్యం

రూ.50 లక్షల నగదు సహా  ఆచూకీ కరవు

సెంటినరీ కాలనీ, న్యూస్‌టుడే: భూమి రిజిస్ట్రేషన్‌ కోసం బయలుదేరిన ఇద్దరు వ్యక్తులు మార్గ మధ్యలో రూ.50 లక్షల నగదు సహా అదృశ్యమైన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండల పరిధిలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. రామగిరి మండలం లద్నాపూర్‌కు చెందిన రైతు ఉడుత మల్లయ్య, అదే గ్రామానికి చెందిన రేషన్‌డీలర్‌ చిప్ప రాజేశం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం సమీపంలో 10 ఎకరాల భూమి కొనుగోలుకు నాలుగేళ్ల కిందట ఒప్పందం చేసుకున్నారు. కొంత మొత్తం బయానా చెల్లించారు. ఆ తర్వాత భూమి అమ్మకం విషయంలో యజమాని, కొనుగోలుదారుల మధ్య వివాదం నెలకొనడంతో కొనుగోలు ప్రక్రియ నిలిచిపోయింది. ఇటీవల ఇరువర్గాల మధ్య జరిగిన చర్చలతో వివాదంపరిష్కారమైంది. భూమి రిజిస్ట్రేషన్‌ చేసిచ్చేందుకు యజమాని అంగీకరించారు. డబ్బు ఆన్‌లైన్‌లో పంపిస్తామని మల్లయ్య, రాజేశంలు చెప్పగా.. యజమాని మాత్రం నగదు రూపంలోనే ఇవ్వాలని అడిగాడు. ఈ నెల 17న స్లాట్‌ బుక్‌ చేశారు. మల్లయ్య, రాజేశంలు శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు రూ.50 లక్షల నగదుతో ద్విచక్రవాహనంపై లద్నాపూర్‌నుంచి కాటారం తహసీల్దారు కార్యాలయానికి బయల్దేరారు. మల్లయ్య కుమారులు సదయ్య, రవిలు మరో ద్విచక్రవాహనంపై వారిని అనుసరించారు. మంథని దాటిన తర్వాత మల్లయ్య, రాజేశంలు కాటారం మార్గంలో వెళ్లగా.. మల్లయ్య కుమారులు తాడిచెర్ల మీదుగా కాటారం తహసీల్దారు కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 2 దాటినా మల్లయ్య, రాజేశంలు తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకోలేదు. వారికి ఫోన్‌చేయగా స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. అనుమానంతో సదయ్య మంథని రహదారి మీదుగా గాలిస్తూ వెనక్కి వచ్చారు. మంథని మండలం బిట్టుపల్లి సమీపంలో రోడ్డుపక్కన మల్లయ్య, రాజేశంలు ప్రయాణించిన ద్విచక్ర వాహనం కనిపించింది. ఆపరిసరాల్లో వెతికినప్పటికీ వారిద్దరి ఆచూకీ లభించలేదు. మల్లయ్య, రాజేశంల అదృశ్యంపై రాజేశం భార్య పుష్పలత ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన