పులి చర్మం తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

ప్రధానాంశాలు

Published : 30/07/2021 05:45 IST

పులి చర్మం తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

ములుగు, న్యూస్‌టుడే: పులి చర్మాన్ని తరలిస్తున్న ఇద్దరిని ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వాజేడుకు చెందిన తిరుమలేష్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా తాళ్లగూడెం మండలం చుండూరుకు చెందిన సాగర్‌ మిత్రులు. పులి చర్మం విక్రయించడానికి సహాయం చేయాలని సాగర్‌ తిరుమలేష్‌ను కోరాడు. ఒక వ్యక్తి రూ.30 లక్షలకు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని తిరుమలేష్‌ చెప్పడంతో సాగర్‌ తన గ్రామానికే చెందిన సత్యంతో పులి చర్మాన్ని పంపాడు. గురువారం దానిని అమ్మడానికి ఏటూరునాగారంలోని ముల్లెకట్ట వారధి వద్ద తిరుమలేష్‌, సత్యం ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డారు. అటవీశాఖ ఎఫ్‌డీవో గోపాల్‌రావుకు సమాచారం అందించి అటవీ సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు. పులి చర్మంతో పాటు ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన