రూ.16 వేల కోసం ప్రాణం బలి

ప్రధానాంశాలు

Published : 15/09/2021 04:35 IST

రూ.16 వేల కోసం ప్రాణం బలి

ఆటోడ్రైవరును కట్టేసిన తోటి డ్రైవర్లు
తప్పించుకునే క్రమంలో లారీ ఢీకొని మృతి

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో రూ.16 వేల కోసం తమతోపాటు ఆటో నడుపుతున్న వ్యక్తిని ఆటోడ్రైవర్లు ఇంట్లో కట్టేశారు. వారినుంచి తప్పించుకుని వెళ్తుండగా టిప్పర్‌ ఢీకొని ఆయన మృతిచెందారు. మృతుని భార్య షేక్‌ మహేబున్నీసా తెలిపిన వివరాల మేరకు బెల్లంకొండకు చెందిన షేక్‌ సుభానీ (33) ఆటోడ్రైవర్‌. స్థానికుడైన రెహమాన్‌ ఆటోకు డ్రైవరుగా సుభానీ వెళ్తున్నారు. వారితోపాటు గజని సొంత ఆటో నడుపుతున్నాడు. గజనికి చెందిన రూ.16వేలు రెహమాన్‌ ద్వారా మంగళవారం సుభానీ చేతికి అందాయి. అతనికి బెల్లంకొండలో రూ.20 వేల అప్పు ఉంది. అప్పు ఇచ్చిన వ్యక్తి వచ్చి, ఆ నగదుతో పాటు సెల్‌ఫోన్‌ తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని ఆటో యజమానికి సుభానీ తెలియజేసి బుధవారం నగదు తిరిగి ఇచ్చేస్తానన్నాడు. రెహమాన్‌, గజని వినిపించుకోకుండా అతడిని నిర్బంధించారు. విషయం తెలిసి సుభానీ భార్య అక్కడికి వెళ్లి తన భర్తను వదిలేయాలని బతిమాలినా పట్టించుకోలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బయల్దేరారు. ఈలోపు తప్పించుకునేందుకు రోడ్డుపైకి వచ్చిన సుభానీని టిప్పర్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదుచేసినట్లు సీఐ శోభన్‌బాబు చెప్పారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన