వాహనాల తనిఖీలో రూ.4.11 కోట్ల పట్టివేత!

ప్రధానాంశాలు

Published : 21/10/2021 05:47 IST

వాహనాల తనిఖీలో రూ.4.11 కోట్ల పట్టివేత!

హవాలా డబ్బుగా పోలీసుల అనుమానం

చిట్యాల, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా చిట్యాలలో జాతీయ రహదారిపై నిర్వహించిన వాహనాల తనిఖీలో రూ.4.11 కోట్ల నగదు పోలీసులకు పట్టుబడింది. ఈ మేరకు చిట్యాలలో కేసు నమోదైనప్పటికీ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అందిన పక్కా సమాచారంతో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్తున్న టీఎస్‌10ఈవై 6160 నంబరు కియా కారును ఆపి తనిఖీ చేయగా సీట్ల కింద రహస్యంగా దాచిపెట్టిన రూ.4.11కోట్ల నగదు లభించింది. దీన్ని హవాలా డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నగదుతోపాటు కారులో ఉన్న వీరేంద్ర(మహారాష్ట్ర), కన్నారాం(రాజస్థాన్‌)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన