జేసీబీ ఢీకొని ముగ్గురు మహిళా కూలీల మృతి

ప్రధానాంశాలు

Published : 22/10/2021 04:51 IST

జేసీబీ ఢీకొని ముగ్గురు మహిళా కూలీల మృతి

మైదుకూరు, న్యూస్‌టుడే: కడప జిల్లా మైదుకూరు మండలం ఆదిరెడ్డిపల్లె సమీపంలో గురువారం జేసీబీ ఢీకొని ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని కేశలింగాయపల్లెకి చెందిన కూలీలు పొలం పనులు ముగించుకుని గ్రామానికి వెళ్లేందుకు రోడ్డుపైకి చేరుకున్నారు. అక్కడున్న మోరీ రక్షణగోడపై కూర్చొని వాహనం కోసం ఎదురుచూస్తుండగా పోరుమామిళ్ల నుంచి మైదుకూరు వైపు వస్తున్న జేసీబీ అదుపుతప్పి వారి మీదుగా దూసుకెళ్లింది. ప్రమాదంలో సింగంశెట్టి మహాలక్షుమ్మ (50), గవ్వల శేషమ్మ (65), గవ్వల పుల్లమ్మ (60) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తుపాకుల వీరమ్మ, బండి పుల్లమ్మ, పసల బాలగురమ్మ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన జేసీబీ చోదకుడిని మైదుకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన